కూకట్ పల్లిలో జనసేన జెండా ఎగరాలి: నాదెండ్ల మనోహర్
Telangana election2023: కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన అభ్యర్ధి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళ కృషి చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం కూకట్ పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఎన్నికల ప్రచార సరళి, అనుసరించాల్సిన విధానాలపై పార్టీ బాధ్యులతో మనోహర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ప్రచారం చేయాలని సూచించారు….