కవి జీవితం …
కవి ఎప్పుడూ రెండు జీవితాలను జీవిస్తుంటాడు. ఒకటి బాహ్యప్రపంచంలో, రెండోది అంతరంగంలో… కవి కళ్ళలోకి సూటిగా చూడు. అంతులేని అగాధాలు కనిపిస్తాయి. కాస్త సుదీర్ఘంగా చూశావనుకో, నువ్వందులో మునిగిపోవడం ఖాయం. చాలామంది కవుల కళ్ళలోకి అలా చూడరనుకో, కనీసం, కవి రాసిన కవిత్వాన్ని చేతుల్లోకి తీసుకో, ఒక్కొక్క పదమే తాపీగా చదువుకో. కవి రెండు భిన్నప్రపంచాల్లో జీవిస్తుంటాడు. — డకోటా మూలం: ఎమ్నాబీ తెలుగు స్వేచ్చానువాదం: పన్యాల జగన్నాథదాసు