మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ పోరు.. కాంగ్రెస్‌దే పైచేయి..!!
లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీఫైనల్‌గా భావిస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ఒక్కటైన మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి హిందీ బెల్టు రాష్ట్రాలలో తన పట్టు తగ్గలేదని నిరూపించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంటే, ఇక్కడ అధికార పగ్గాలు చేపట్టి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందనే సంకేతాలివ్వాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ ఐదు…