Karimnagar: దుర్గాదేవిగా అమ్మవారు.. జోరువానలో మహిళల బతుకమ్మ..!
Karimnagar: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తుదిదశకు చేరుకున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం( ఎనిమిదోవ రోజు) అమ్మవారు దుర్గాష్టమి సందర్భంగా శ్రీ మహాదుర్గగా దర్శనమిచ్చారు. దేవీ దర్శనం కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల ఆలయానికి పోటెత్తారు. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. నవరాత్రి ఉత్సవాలు ముగింపుకు మరో రోజు మాత్రమే మిగిలి ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు….