ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. సీఎంగా ఫడ్నవీస్?
ఊహించినట్లగానే మహారాష్ట్ర రాజకీయ సంక్షోబానికి తెరపడింది. బలపరీక్షకు ముందే సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నిర్ణయంపై సుప్రీంకోర్డు వెళ్లిన శివసేనకు ఎదురుదెబ్బతగిలింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సిందేనని ధర్మాసనం తీర్పు వెలువరించిన.. క్షణాల్లోనే సోషల్ మీడియా వేదికగా ఠాక్రే తన రాజీనామా ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి సైతం తాను రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇన్నాళ్లు సహకరించిన సోనియాగాంధీ, శరద్ పవర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు…