క్లైమాక్స్ కి చేరిన మహరాష్ట్ర రాజకీయ సంక్షోబం!

మహరాష్ట్ర రాజకీయ సంక్షోబానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ.. తక్షణమే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కోరారు.ఈమేరకు గవర్నర్ సీఎంకు లేఖరాశారు. మరోవైపు గవర్నర్ నిర్ణయం పై శివసేన మండిపడుతోంది.బలనిరూపణ చట్టవిరుద్ధమని.. ఈవిషయమై సుప్రీం కోర్డు కు వెళ్తామని స్పష్టం చేసింది. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బలపరీక్షకు ఆదేశించాలని గవర్నర్ ని కోరిన కొద్ది గంటల్లోనే.. భగత్ సింగ్ కోశ్యారీ బలనిరూపణపై నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చకు దారితీసింది.

మరోవైపు శివసేన తిరుగుబాటు నేత శిందే కీలక ప్రకటన చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి గుహవటి నుంచి ముంబై చేరుకుంటున్నట్లు వెల్లడించారు. మహావికాస్ అఘాడీ కూటమికి వ్యతిరేకంగా బలనిరూపణ పరీక్షలో పాల్గొననున్నట్లు శిందే తెలిపారు.

అటు బలనిరూపణపై శివసేన వర్గం మండిపడుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత అంశం సుప్రీంకోర్డు పరిధిలో ఉందని.. గవర్నర్ నిర్ణయం చట్టవిరుద్ధమని ఆరోపిస్తోంది. మెజారిటీ నిరూపణ విషయంపై సుప్రీంకోర్డుకు వెళ్లే విషయంపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
ఇక బీజేపీ మాజీ సీఎం దేవేంద్ర ఫడ్రవీస్ బలనిరుపణ నేపథ్యంలో ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేలందరూ బుధవారం సాయంత్రం లోపూ తాజ్ హాటల్ కి చేరుకోవాలని ఆదేశించడం గమన్హారం.

గత కొద్ది రోజులుగా మహరాష్ట్రలో రక్తికట్టిస్తున్న రాజకీయ డ్రామా చివరి అంకానికి చేరింది. బలనిరూపణ పరీక్షలో ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ విఫలమైతే.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.