ManmohanSingh : మంచి పనుల్తో మాట్లాడిన మౌని..!
ManmohanSingh: పీవీ నర్సింహారావు దూరదృష్టి, సోనియాగాంధీ త్యాగం.. వెరసి, భారత దేశానికి కీలక సమయంలో పదేళ్లు ప్రధానమంత్రిగా లభించిన మానవతానేత మన్మోహన్సింగ్! ‘మాట్లాడరు, సొంత నిర్ణయాలు తీసుకోలేరు, టెన్ జన్పథ్ చేతిలో కీలుబొమ్మ’ లాంటి విమర్శలున్నా… ఎన్నో విషయాల్లో ఆదర్శనేత ఆయన. నిగర్వి, నిరాడంబరుడు, నిష్కళంకుడు, అన్నిటికీ మించి పక్కా నిజాయితీపరుడు. కష్టకాలంలో దేశాన్ని ఆర్థికంగా పునరుజ్జీవింపజేసిన సంస్కర్త. ఆర్బాటం లేకుండా దశాబ్దాల తరబడి దేశ గమనాన్ని నిర్దేశించే ఉపాధిహామీ, ఆహారభద్రత, సమాచారహక్కు, విద్యాహక్కు, భూసేకరణ-2013, కనీస…