Actress: పత్రికలు రాసేవన్నీ నిజాలు కావు..అబద్ధాలన్నీ గాల్లో కలిసిపోవు..!
విశీ(వి.సాయివంశీ): A Public Celebrity is just a Public Celebrity, but not a Public Property. ఇది మనకు అర్థమైతే సమస్య లేదు. అర్థం కానప్పుడే సమస్యలు వస్తాయి. దినపత్రికలన్నీ అన్నిసార్లూ నిజాలే రాస్తాయన్న గ్యారెంటీ లేదు. రాసిన అబద్ధాలన్నీ గాల్లో కలిసిపోతాయనీ కాదు. ఒక్కోసారి వెంటాడి, శిక్షించే దాకా తీసుకెళ్తాయి. నటి భువనేశ్వరి వర్సెస్ నడిగర్ సంగం విషయంలో జరిగింది ఇదే! 2009లో అత్యంత పాపులర్ అయిన సంఘటన ఇది. చెన్నై నగరంలోని…