తెలంగాణాలో ఒమిక్రాన్ టెన్షన్..ఒక్కరోజే 14 కేసులు!
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్.. తెలంగాణలోను వణికిస్తోంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో అత్యధికంగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం, రాష్ట్రంలో కేసుల సంఖ్య 38కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఈనేపథ్యంలో వైరస్ వ్యాప్తిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఒమిక్రాన్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పండుగలు, వేడుకల్లో జనం గుమిగూడకుండా చూడాలని, క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సంక్రాంతి వేడుకల్లోనూ…