కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్న..ప్రజాభిప్రాయం మేర రాజీనామా: రాజగోపాల్ రెడ్డి
రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికపై సందిగ్థత కొనసాగుతూనే ఉంది. హస్తం పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్..తాజాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా పై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తున్నట్లు.. ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు.అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు మరోసారి విఫలమయ్యాయి. తాను పార్టీ మార్పుకు కట్టుబడి ఉన్నట్లు రాజగోపాల్ వారితో తేల్చిచెప్పినట్లు తెలిసింది. కాగా మునుగోడు ఉప ఎన్నికపై తెలంగాణ వ్యాప్తంగా…