ప్రముఖ పంచాంగకర్త గుండెపోటుతో కన్నుమూత
ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి హఠాన్మరణం చెందారు. సోమవారం సాయంత్రం ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో యశోద ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. జ్యోతిషులుగా 30 ఏళ్లకు పైగా ములుగు సిద్ధాంతి సేవలందించారు. ములుగు సిద్ధాంతి ఆకస్మిక మరణం పట్ల జ్యోతిషవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు 4 దశాబ్ధాలకు పైగా నిష్పక్షపాతమైన, నిజమైన జ్యోతిష ఫలితాలను ప్రజలకు అందించారు రామ లింగేశ్వర సిద్ధాంతి. పంచాంగం ద్వారా భవిష్యత్తులో…