ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి హఠాన్మరణం చెందారు. సోమవారం సాయంత్రం ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో యశోద ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. జ్యోతిషులుగా 30 ఏళ్లకు పైగా ములుగు సిద్ధాంతి సేవలందించారు. ములుగు సిద్ధాంతి ఆకస్మిక మరణం పట్ల జ్యోతిషవేత్తలు, ఆధ్యాత్మిక వేత్తల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దాదాపు 4 దశాబ్ధాలకు పైగా నిష్పక్షపాతమైన, నిజమైన జ్యోతిష ఫలితాలను ప్రజలకు అందించారు రామ లింగేశ్వర సిద్ధాంతి. పంచాంగం ద్వారా భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను లక్షలాది మందికి మార్గదఋసనం చేయించారు. గుంటూరు నుంచి హైదరాబాద్ కి వలస వచ్చిన ఆయన.. స్థిరనివాసం ఏర్పరుచుకుని ఎంతోమంది సిని, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు.. దేశ విదేశాలనుంచి వచ్చేవారికి వారి సమస్యలకు పరిష్కారాలు తెలిపి ఎన్నో కుటుంబాలకు ఆరాధ్యులుగా ఉన్నారు.
ములుగు సిద్ధాంతి గా ఆధ్యాత్మ జీవనాన్ని ప్రారంభించడానికన్నా ముందు MR Prasad పేరుతో మిమిక్రీ కళాకారుడిగా అంతర్జాతీయ ఖ్యాతి కాంచారు రామ లింగేశ్వర వర ప్రసాద్. ఆయన చేసిన Sreedeavi peLLi kaaseT ఆరోజుల్లో లక్షలాది కాపీలతో రికార్డులు సృష్టించింది. సినీ నటులు AVS, బ్రహ్మానందం వంటి కళాకారులతో ఆయన వేలాది ప్రదర్శనలు నిర్వహించారు.
శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి, వేదాలలో, పూజా, హోమాది క్రతువులలో శిక్షణపొందిన బ్రాహ్మణులతో ప్రతీ మాస శివరాత్రికి పాశుపతహోమాలు నిర్వహించేవారు. దైవం గొప్పదని.. ఆ దైవం మంత్రానికి సంతుష్టుడవుతాడని, హోమం ప్రీతితో స్వీకరించి మనకు కావాల్సిన ఫలితాన్ని అందిస్తారని చెప్పేవారు. ప్రతిసంవత్సరం పంచాంగ ఫలితాలను ములుగు యూట్యూబ్ చానెల్ ద్వారా కోట్లాది మంది వీక్షకులకు ఉచితంగా అందిచేవారు రామ లింగేశ్వర సిద్ధాంతి. కాగా కరోనా మహమ్మారినుండి ప్రపంచానికి రక్షించడం కోసం ఇటీవల యాదగిరిగుట్ట, శ్రీశైలం, శ్రీకాళహస్తిలలో ఆయుష్య హోమాలు నిర్వహించారు.
.