వన్డే సిరీస్ దక్షిణాఫ్రికా కైవసం..!

వన్డే సిరీస్ దక్షిణాఫ్రికా కైవసం..!

దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత జట్టు ఓటమిని చవిచూసింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టు.. చివరికి వరకు పోరాడిన ఫలితం దక్కలేదు. ఫలితంగా ప్రొటీస్​ జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను అతిథ్య జట్టు 3_0 తేడాతో కైవసం చేసుకుంది.
అంతకుముందుటాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు.. ఓపెనర్ డికాక్ (124) సెంచరీతో అదరగొట్టాడు. అతనికి తోడు డస్సెన్ హాఫ్​సెంచరీ (52) తోడవ్వడంతో ఆతిథ్య జట్టు 287 పరుగులు చేసింది. 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను వీరిద్దరూ కలిసి ఆదుకున్నారు. 144 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 3, బుమ్రా 2, దీపక్​ చాహర్​ 2, చాహల్​ 1 వికెట్​ దక్కించుకున్నారు. టీమ్‌ఇండియా బౌలర్లలో ప్రసిధ్‌ 3, బుమ్రా 2, చాహర్ 2, చాహల్ ఒక వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 49.2 ఓవర్లలో 283 పరుగులకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ (65), శిఖర్ ధావన్ (61), దీపక్ చాహర్ (54) అర్ధశతకాలు సాధించినా ఓటమి తప్పలేదు. సూర్యకుమార్‌ యాదవ్ (39), శ్రేయస్‌ అయ్యర్ (26) రాణించారు. ఆఖర్లో దీపక్‌ చాహర్ అర్ధ శతకంతో పోరాడిన ఫలితం దక్కలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, పెహులక్వాయో 3.. ప్రిటోరియస్ 2, మగలా, కేశవ్ మహరాజ్‌ చెరో వికెట్ తీశారు.