మూడోసారి ప్రధానిగా మోదీ!

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చింది. కాకపొతే ఎన్డీయే సీట్ల సంఖ్య 296కు పడిపోతుందని చెప్పింది. అంతేకాక త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ మోదీకి 50 శాతం పైగా మద్దతు తెలుప్తున్నట్లు సర్వే రిపోర్ట్ చెబుతుంది.
కాగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి సొంతంగా 271 సీట్లతో సొంతంగా అధికారంలోకి వస్తుందని.. ప్రధానిగా మూడోసారి కూడా ప్రజలు నరేంద్ర మోడీనే కోరుకుంటున్నారని వెల్లడించింది.2024 ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కమలం పార్టీ.. పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్ చేస్ అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ప్రపంచలోనే నెం.1 దేశాధినేత మోదీ..

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజామోదం గల ఉన్న దేశాధినేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అగ్ర స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ ఆయా దేశాల్లో నిర్వహించిన సర్వేలో.. మోదీ 71 శాతంతో అగ్రస్థానంలో నిలవగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరో స్థానంలో నిలిచారు. జనవరి 13 నుంచి 19 వరకు ప్రతి దేశంలోనూ వయోజనుల నుంచి అభిప్రాయాలు సేకరించి మార్నింగ్‌ కన్సల్ట్‌ ఈ రేటింగ్స్‌ను విడుదల చేసింది. అమెరికాలో సగటున రోజుకు 45వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించగా.. మిగతా దేశాల్లో సగటున 3000 – 5000 మందిని సర్వే చేశారు. ఇక మార్నింగ్‌ కన్సల్ట్‌ గత సర్వేల్లోనూ ప్రజామోదంలో మోదీ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచారు. 2020 మే నెలలో వెల్లడించిన సర్వేలో మోదీకి 84 శాతం ప్రజామోదం లభించింది.