జగన్ లేకుంటే ఏ పథకమూ ఆగిపోదు: పవన్ కళ్యాణ్
Janasena: వచ్చే ఎన్నికల్లో జగన్ రాకపోతే పథకాలు ఆగిపోతాయేమో… సంక్షేమం నిలిచిపోతుందేమో అనుకోవద్దు. ఇంతకంటే అద్భుతమైన సంక్షేమ పథకాలు ఉంటాయి తప్ప ఏ పథకమూ ఆగిపోదని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జాతి నాయకుల పేర్లతో సరికొత్త పథకాలను అమలు చేస్తామని ఆయన అన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వీర మహిళల సమావేశంలో పవన్ మాట్లాడారు. ‘‘ విశాఖ పర్యటనలో ఉండగా ఓ 60…