అరుదుగా… HR లో Human..(నివాళి)
‘జర్నలిజం చేయాలని ఎందుకు అనుకున్నావ్?’ ఏదో తెలుగు భాషపైన అభిమానం, పట్టు ఉన్నాయి గనుక ‘పట్టు అంటే, ఎట్లా వచ్చింది ఏమైనా చదివావా?’ ఆ… చదివాను, తెలుగు సాహిత్యం. ‘ఏం సాహిత్యం చదివావు?’ రామాయణ, భారత, భాగవతం వంటి ప్రాచీన పద్య సాహిత్యం నుంచి ఆధునిక వచన సాహిత్యం వరకు ఏవేవో చదివా. ‘….. ఊ, ఎవరెవరి పుస్తకాలు చదివావేంటి?’ నన్నయ, పోతన, పెద్దన, శ్రీనాథుడి నుంచి విశ్వనాథసత్యన్నారాయణ, గురజాడ, శ్రీశ్రీ, చలం, ఆత్రేయ… ఇలా చాలా…