ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యువగళం కు పోటెత్తిన జనం..
Yuvagalam: రాష్ట్రంలో కోట్లాదిప్రజల గొంతుకగా మారి రోజురోజుకూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకుసాగుతున్న యువగళం పాదయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. జోరువర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యువగళం జైత్రయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. జూలై 15వతేదీన రాళ్లపాడు సరిహద్దుల్లో కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టిన యువనేత లోకేష్ పాదయాత్ర 17రోజులపాటు నిర్విరామంగా సాగింది. ఉమ్మడి జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 220 కి.మీ.ల మేర కొనసాగిన యువగళానికి ప్రకాశం జిల్లా ప్రజలనుంచి కనీవినీ ఎరుగని…