×

APpolitics:

2005లో హత్యకు గురైన తండ్రి

– ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదువుకుని నేడు ఉన్నత శిఖరాలకు ఎదిగిన వైనం

– యువనేతకు కృతజ్ఞతలు తెలిపిన మౌనిక

– సంతోషం వ్యక్తం చేసిన నారా లోకేష్

ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదువుకుని, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ఓ విద్యార్థిని శింగనమల, గార్లదిన్నెలో యువగళం క్యాంప్ సైట్ వద్ద యువనేత నారా లోకేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. తండ్రి చనిపోయిన తనను, తన కుటుంబాన్ని తెలుగుదేశంపార్టీ, నారా చంద్రబాబు నాయుడు ఆదుకున్నారని వివరించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ వల్ల తన సోదరి, తాను ఉన్నత స్థానానికి చేరుకున్నామని పేర్కొంది. యువతి చెప్పిన మాటలకు నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. మరింత ఉన్నత స్థాయికి చేరుకుని, పదిమందికి దారిచూపేలా ఆలోచించాలని కోరారు.

‘‘అనంతపురంజిల్లా, బుక్కరాయసముద్రం మండలం, కేకే అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ను ప్రత్యర్థులు 2005లో దారుణంగా హత్యకు గురయ్యారు. ఇతనికి నలుగురు ఆడపిల్లలు. వారిలో మూడవ కూతురు నాగమణి, నాల్గవ కూతురు మౌనికను తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదివించారు. నాగమణి, మౌనిక ఎన్టీఆర్ ట్రస్ట్ లోనే చదువుకున్నారు. ఉన్నత విద్యను కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సహకారంతో పూర్తిచేశారు. నాగమణి ఎన్టీఆర్ ట్రస్ట్ లోనే చదువుకుని హైదరాబాద్ లోని వివిడ్ మైండ్స్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు. మౌనిక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చదివి నేడు ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశారు. వీళ్ల బాబయ్ కొడుకు వెంకటేష్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చదివి బెంగళూరులోని క్రిక్ బజ్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ స్థిరపడ్డారు’’.

తమ కుటుంబాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉన్నత స్థానానికి వెళ్లాయని చెప్పి, కృతజ్ఞతలు చెప్పేందుకు యువనేత నారా లోకేష్ ను కలిశానని మౌనిక వివరించింది.

 

Author

dhoni.raju219@gmail.com

Related Posts

crime: క్షణికానందం కోసం కుటుంబాల నాశనం!

Hyderabad: By Amaravaji Nagaraju ✍🏽 ఒకప్పుడు సమాజంలో పేరు సంపాదించాలంటే ప్రతిభ ఉండాలి… కష్టపడాలి… విలువలు పాటించాలి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని సెకన్ల వీడియోతో కోట్ల మందికి...

Read out all

cinima: “కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి.. నిజమేనా?”

Kollywood: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్.. గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు ప్రేమ, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి....

Read out all

Cinima : రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్

Tollywood: మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద...

Read out all

Telangana: రణమా… శరణమా?… గులాబీ పార్టీలో అంతర్మథనం..!

Telangana: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని భావిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్నారు. అయితే మరోవైపు...

Read out all

cinima: ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా..?

హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల విడుదలపై  చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘ఫౌజీ’తో పాటు ‘స్పిరిట్’ సినిమాల విడుదలపై...

Read out all

cinima: ₹300 కోట్ల క్లబ్‌లో తండ్రీకొడుకులు.. చిరంజీవి-చరణ్ అరుదైన రికార్డు..!!

Tollywood: భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్, వారసత్వం, బాక్సాఫీస్ ప్రభావం గురించి ఎన్నో ఉదాహరణలు ఉన్నప్పటికీ.. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు ఒకే ఏడాదిలో విడివిడిగా ₹300 కోట్లకు పైగా...

Read out all
Optimized by Optimole