newsminute24
Salmankhan: లారెన్స్‌బిష్టోయీకి సల్మాన్ టార్గెవడంపై రాంగోపాల్ వర్మ ‘దిగ్భ్రాంతి’..!
Nancharaiah merugumala senior journalist: తల్లిలేని జింక పిల్లలకు చనుబాలిచ్చే స్త్రీలున్న బిష్ణోయీ సమాజంలో పుట్టిన హిందూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌బిష్టోయీకి సల్మాన్ టార్గెవడంపై రాంగోపాల్ వర్మ ‘దిగ్భ్రాంతి’! జింక పిల్ల తల్లి మరణిస్తే.. ఆ పిల్లను బిష్ణోయీ మహిళ తన చాతి దగ్గరకు తీసుకుని పాలు ఇస్తుంది. పిల్లలకు ఆవుపాలు తాగించి పెంచే మన సమాజంలో ఇది వింత. ఇలాంటి దృశ్యం మనకు ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. కిందటేడాది భారత నటుడు వివేక్ ఓబెరాయ్ దుబాయిలో ఓ…
Religion:మతాచారాలపై మహిళ నిరసన.. !
Religion: మతం ఉంది. దానితో చాలామందికి పేచీ లేదు. కానీ అందులోని ఆచారాలు మనుషుల హక్కులను లాగేస్తున్నప్పుడు, నిస్సహాయులను చేస్తున్నప్పుడు అందరికీ పేచీ ఉంటుంది. ఉండాలి! ఏడో శతాబ్దంలో ఆవిర్భవించిన ఇస్లాం మతంలో అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అనేక ఆచారాలు రూపొందాయనేది అందరికీ తెలిసిందే. ఇస్లాంలో భార్య తన భర్త నుంచి విడిపోయేందుకు ‘ఖులా’ ఉంది. భర్త తన భార్య నుంచి విడిపోవాలంటే మనందరికీ తెలిసిన ‘తలాఖ్’ ఉంది. ఒకవేళ అలా విడిపోయిన భార్యాభర్తలు మళ్లీ…
INC: ‘మహా’త్యాగం కాంగ్రెస్‌కు సాధ్యమా..?
Maharashtraelection2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశమే! అలసత్వం వల్ల హర్యానాలో చేజారిన అసెంబ్లీ గెలుపును ఒడిసిపట్టేందుకే కాకుండా కూటమిగా ‘ఇండియా’ను భవిష్యత్తులో బలోపేతం చేసేందుకు ఈ ఎన్నిక ఒక సవాల్. ఆ సవాల్‌ను స్వీకరించడానికి అవసరమైన గట్టి సైద్దాంతిక పునాది పార్టీకుంది. ఏఐసీసీ బెంగళూర్ ప్లీనరీ (2001) నుంచి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మౌంట్‌అబూ భేటీ (2002) దాకా.. జరిగిన మేధోమధనంలో, రాజకీయ తీర్మానాల్లో, విధాన ప్రకటనల్లో చెప్పింది ఇపుడు ఆచరిస్తే చాలు! 2004…
cyber: స్మార్ట్ ఫోన్ తో జాగ్రత్త ..హెచ్చరిస్తున్న నిపుణులు..!
Smartphone: నిద్రలేచిన మొదలు..పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. వినోదానికి, కాలక్షేపానికి, వ్యాపార లావాదేవీలతో పాటు ప్రతి అంశానికి సంబంధించి.. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి వేళ్లు టచ్ స్క్రీన్ పై ఉంటున్నాయి. సాంకేతికంగా దగ్గర చేస్తూనే.. సైబర్ వ్యసనానికి బానిసగా మార్చేస్తోంది. వైవాహిక జీవితాల్లో కలహాలు..చిన్నారులు, యువత పై తీవ్ర ప్రభావం చూపుతోంది. పలు సర్వే సంస్థలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సైబర్ వ్యసనం నుంచి విముక్తి కలిగించడంపై…
Saibaba: ఒక వీరునికి కడసారి వీడ్కోలు..!
తాడి ప్రకాష్: 2024 అక్టోబర్ 14,హైదరాబాద్, మౌలాలిలోని ఒక పెద్ద అపార్ట్ మెంట్ కింద కార్ పార్కింగ్ ప్లేస్ అంతా జనంతో కిటకిటలాడుతోంది. మధ్యాహ్నం 12 దాటుతోంది. జనం వస్తూనే వున్నారు. అల్విదా.. సాయిబాబా అంటున్నారెవరో! ఎర్ర గులాబీల దండల కింద ఒక కవి ఏ కదలికా లేకుండా వున్నాడు. సుత్తికొడవలితో మెరుస్తున్న ఎర్ర జెండా కింద… రాజీపడని, తలవంచని, భయమెరుగని యోధుడొకడు అచేతనంగా వున్నాడు. ప్రొఫెసర్ గోకరకొండ నాగసాయిబాబా అనే ప్రజల మనిషిని చివరిసారి చూడడం…
NaaluPennungal: ‘విధేయన్’ కోసం తన్వీ ఆజ్మీ.. ‘నాలు పెన్నుంగల్’ కోసం నందితాదాస్..!
నాలుపెన్నుంగల్(నలుగురుస్త్రీలు): తగళి శివశంకర పిళ్లై మలయాళ సాహిత్యనిధి. వందల కథలు రాశారు. అందులోనుంచి నాలుగు కథలు ఎంపిక చేశారు మలయాళ ప్రసిద్ధ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్. కథలు నాలుగున్నాయి, వాటిని నాలుగు సినిమాలుగా తీయలేం! ఒకే సినిమాలో నాలుగు కథలు చూపించాలి. అందుకు తగ్గట్టు స్ర్కిప్ట్ రాసుకున్నారు. అది 2007 నాటి మాట. మలయాళ సినిమారంగంలో తొలి Anthology Filmకి అదే అంకురార్పణ అయి ఉండవచ్చు. ఇందులో ఏ కథకు ఆ కథ వేరుగానే ఉంటుంది. కథలన్నీ…
saibaba: ఏమైపోతున్నాం..?
saibaba death: చట్టం ముసుగులో…. చట్టవ్యతిరేకంగా, రాజ్యాంగం పేరిట… రాజ్యదాష్టీకంతో ఒక మానవ హక్కుల కార్యకర్తను, సమాజహిత మేధావిని వెంటాడి, వేటాడి, నిర్బంధించి, హింసించి యాభయారేళ్లకే నూరేళ్లు నిండేలా మట్టుపెట్టిన హంతకులెవరు? ఆయనది సహజమరణం మాత్రం కాదు, ఇది జగమెరిగిన సత్యం! మరి ఈ హత్యను ఎవరి అకౌంట్లో వేద్దాం? ఇప్పుడెవరిని శిక్షిద్దాం? హంతకులు తప్పించుకుపోవాల్సిందేనా? ఎవరమూ నోరెత్తకపోతే ఎలా?? ‘వంద మంది నేరస్తులు తప్పించుకుపోయినా పరవాలేదు, ఒక నిరపరాధికి శిక్ష పడొద్దు’ అన్న సహజన్యాయ సూత్రమే…