Hyderabad: రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి…

హైదరాబాద్: ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్! ఈ తొలి ఏకాదశి పర్వదినాన,విష్ణు గాయత్రీ మంత్రంతో ప్రతి ఒక్కరి సంకల్పాలు సిద్ధించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంక్షించారు. అత్యంత పవిత్ర తొలి ఏకాదశి రోజున విష్ణువును స్మరిస్తూ..రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.

Read More

Ekadashi:తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా పరిగణించబడే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.”తొలి ఏకాదశి పండుగ హిందువులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ పవిత్ర దినాన్ని తెలంగాణ ప్రజలు భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మికతతో జరుపుకోవాలని కోరుతున్నట్లు” పేర్కొన్నారు. ప్రజలందరికీ మంచి జరగాలని, ఆరోగ్యం, ఆనందం, శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ మహేష్ కుమార్ గౌడ్…

Read More

ElonMusk:ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటన – ‘ది అమెరికా పార్టీ’

Elon Musk: ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేతగా పేరు తెచ్చుకున్న మస్క్ తాజాగా రాజకీయ అరగ్రటం చేశారు. ఇందుకోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పార్టీకి ఆయన పెట్టిన పేరు ‘ది అమెరికా పార్టీ’. అమెరికాలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం నిర్వీర్యమైందని, ప్రజలకు అసలు స్వేచ్ఛ లేదని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ప్రజల శ్రేయస్సు కోసం, వారి స్వేచ్ఛను రక్షించేందుకునే ఈ నిర్ణయం…

Read More

MaheshBabu: సూపర్ స్టార్ బర్త్డే సందర్భంగా రాజమౌళి టీజర్.!

Tollywood:  టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఓ శుభవార్త. ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు కోసం సూపర్ స్టార్ నటించిన పాత సినిమాల నుంచి ఒక ప్రత్యేక 4K ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ ప్రత్యేక ట్రైలర్‌ను హరి హర వీరమల్లు సినిమా షోతో పాటు థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ ట్రైలర్‌కి సంబంధించిన ఎడిటింగ్ పూర్తి చేసి, థియేట్రికల్ ప్రెజెంటేషన్‌కు సిద్ధంగా ఉంచారు. 4Kలో విడుదలవుతున్న ఈ ట్రైలర్…

Read More

jagityala: ఫ్రెండ్స్ అవమానించారని బీటెక్ విద్యార్థినీ ఆత్మహత్య..!

జగిత్యాల: స్నేహితుల తీరుతో మానసికంగా క్షోభకు గురైన ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌కు చెందిన కాటిపెల్లి నిత్య (21) హైదరాబాద్‌ కూకట్‌పల్లి (KPHB)లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉండి బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. ఇటీవల చదువులో వెనుకబడినదంటూ స్నేహితులు వైష్ణవి, సంజన ఆమెను అనుచితంగా అవమానించినట్టు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన నిత్య ఈ నెల 2న స్వగ్రామానికి వెళ్లి గడ్డి మందు సేవించింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే…

Read More

Mlckavitha: 7 లక్షల రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర: ఎమ్మెల్సీ కవిత

Mlckavitha: ఎమ్మెల్సీ కవిత ట్వీటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు. రేషన్ కార్డుల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నుతోందని ట్వీట్ లో ఆమె ప్రస్తావించారు. వర్షాకాలం నేపథ్యంలో జూన్ లో మూడు నెలల రేషన్ పంపిణీ జరిగిందని.. అనివార్య కారణాలతో 7.24 లక్షల కుటుంబాలు రేషన్ తీసుకోలేదని పేర్కొన్నారు. రేషన్ తీసుకోకపోవడాన్ని సాకుగా చూపుతూ ఏడు లక్షలకు పైగా కుటుంబాల రేషన్ కార్డులను తొలగించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందన్నారు. అర్హులైన వారందరికీ…

Read More

Crime: పూణే అత్యాచార ఆరోపణ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి…!

పుణె: మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకున్న అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐటీ కంపెనీలో పనిచేస్తున్న 22ఏళ్ల యువతి తనపై కొరియర్ డెలివరీ ఏజెంట్ అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. అయితే దర్యాప్తులో అసలు కథ వెలుగులోకి వచ్చింది. యువతి చేసిన ఆరోపణల్లో అసలు డెలివరీ బాయ్ అనే ఎలిమెంట్ లేదని, ఆమెకు బాగా పరిచయమైన ఓ స్నేహితుడినే ఇంటికి…

Read More

schemes: మొక్కు”బడి” పథకాలతో మొదటికే మోసం..!

విశ్వ జంపాల: భారత రాజ్యాంగం ప్రకారం కుల, మత, వర్గ, లింగ, ప్రాంత వ్యత్యాసాలు చూపకుండా, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక బేధాలు పాటించకుండా, రాజు, పేద తేడా లేకుండా అందరికి ఒకే రకమైన, నాణ్యమైన విద్యా-వైద్యాన్ని అందించాల్సిన భాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజల కష్టార్జితం. ప్రజలు తమ ప్రతినిధిగా ప్రభుత్వాన్ని ఓట్ల ద్వారా ఎన్నుకుంటున్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. “నేటి బాలలే…

Read More

Telangana: వినాశనానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా ఆ సంక్షేమ పథకాలు..!

కిరణ్ రెడ్డి వరకాంతం: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రైతు బంధు పథక ప్రయోగం బీఆర్ఎస్ పార్టీకి ఫుల్ సక్సెస్ నిచ్చింది.ఆ పథకం ప్రభావం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాదు…వ్యతిరేకతను పక్కకు నెట్టి 88 సీట్లతో ఘన విజయాన్ని అందించి పెట్టింది.ఇక రైతు బంధు పథకం ఎంత సక్సెస్ అయ్యిందో….దళిత బంధు అంత అట్టర్ ప్లాప్ అయ్యింది.సొంత పార్టీ నేతలే ఒప్పుకున్న వాస్తవమిది.దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అప్పటి అధికార పార్టీ నేతల చేతివాటాలు గులాభి పార్టీ కొంప…

Read More

Telangana: ముగ్గురికీ ‘స్థానికం’ మీటా-కట్టా..!

Telangana: వచ్చే రెండు, మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమౌతోంది. సెప్టెంబరు లోపు పంచాయితీ ఎన్నికలు జరపాలని హైకోర్టు నిర్దేశించింది. కొనసాగుతున్న వేర్వేరు కోర్టు కేసుల్ని బట్టి… ఇదే దిశలో జడ్పీటీసీ-ఎమ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలూ జరుగుతాయి. అధికార కాంగ్రెస్లోనే కాక విపక్షాలు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ల్లోనూ అప్పుడే వేడి మొదలైంది. తాజా పరిస్థితుల్లో ఆయా పార్టీలకు… సానుకూల అంశాలు ఆశ పుట్టిస్తుంటే ప్రతికూల…

Read More
Optimized by Optimole