నిండు హృదయంతో.. కవివరా నీకిదే నివాళి..!
కవీ! నీ భావసంపదకు వందనాలు, నీ ఊహశాల్యతకు నమస్సులు, నీ కవితా పటిమకు నీరాజనాలు. ఓ IAS అధికారిగా పాలనా గురుతర బాధ్యతల్లో ఉంటూ కూడా తెలుగు సాహితీ సేద్యం చేసిన కృషీవళుడు డా.జె.బాపురెడ్డి. ‘….. అంతరాల ఈ గోడ పగులగొట్టు, సరికొత్త మేడ కట్టు’ అని సినిమా థియోటర్లలో నీ పాట వినిపించే ఆ రోజుల్లో బడికి వెళుతుండిన బాల్యం మాది. సృజనతో, భావుకతతో… ప్రతి మనిషిలో జనించే వ్యక్తావ్యక్త ఆనంద పారవశ్యానికి తార్కిక జ్ఞానంతో,…