Shobha: 18 ఏళ్లు నిండకుండానే తనువు చాలించిన హీరోయిన్ విషాద కావ్యం..
విశీ: నిండా పదిహేడేళ్ల అమ్మాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు. స్టార్ స్టేటస్. అద్భుతమైన రోల్స్. సమకాలీన నటీమణులకు నిజంగానే దడ పుట్టించేంత నటనా వైదుష్యం.. ఇవన్నీ నటి శోభ సొంతం. తల్లిదండ్రులు మలయాళీలు. కానీ శోభ పుట్టి పెరిగిందంతా చెన్నై. ఆమె తల్లి ప్రేమ కూడా మలయాళ నటి కావడం విశేషం. ‘తట్టుంగల్ తిరక్కపడుమ్’ అనే తమిళ సినిమాతో బాలనటిగా అరంగేట్రం చేసి, ఆ తర్వాత హీరోయిన్‌గా మారి విజయ శిఖరాలు ఎక్కారు…