రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ఉలిక్కిపాటు ఎందుకు?: పవన్ కల్యాణ్
రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే వైసీపీ ప్రభుత్వానికి ఉలిక్కిపాటు ఎందుకని? ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లాంటి మాటలు జగన్ ప్రభుత్వానికి తెలియదని ఎద్దేవ చేశారు.ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదన్నారు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని వైసీపీ ముఖ్యమంత్రి భావిస్తున్నారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకున్న…