కాపులకు సంపూర్ణ ‘రాజ్యాధికారం’ రాకున్నా..‘రాజకీయాధికారం’ వచ్చేసిందా?
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజకీయ పార్టీల అధ్యక్షులూ కాపులే! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి తమ నాలుగు కులాల్లో దేనికీ రాలేదనే బాధ కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులను ఇప్పుడు దహించివేస్తోంది. నిజమే. సంపూర్ణ ‘రాజ్యాధికారం’ ఇంకా ఈ నాలుగు కులాల సముదాయానికి గగన కుసుమం మాదిరిగానే కనిపిస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ పేరిట జరిగిన తొలి ‘రాజ్యాధికార’ ప్రయత్నం విఫలమైంది. 2014 ఎన్నికల్లో తాను స్వయంగా పోటీచేయని జనసేన మాత్రం తెలుగుదేశం పార్టీని అమరావతిలో అందలమెక్కించింది….