కవి జీవితం …

కవి ఎప్పుడూ రెండు జీవితాలను జీవిస్తుంటాడు. ఒకటి బాహ్యప్రపంచంలో, రెండోది అంతరంగంలో… కవి కళ్ళలోకి సూటిగా చూడు. అంతులేని అగాధాలు కనిపిస్తాయి. కాస్త సుదీర్ఘంగా చూశావనుకో, నువ్వందులో మునిగిపోవడం ఖాయం. చాలామంది కవుల కళ్ళలోకి అలా చూడరనుకో, కనీసం, కవి రాసిన కవిత్వాన్ని చేతుల్లోకి తీసుకో, ఒక్కొక్క పదమే తాపీగా చదువుకో. కవి రెండు భిన్నప్రపంచాల్లో జీవిస్తుంటాడు. — డకోటా మూలం: ఎమ్నాబీ తెలుగు స్వేచ్చానువాదం: పన్యాల జగన్నాథదాసు  

Read More

‘ మాతృ’ భూమిని.. భాషను మరిచిపోతే ఏం లాభం?

నేను పుట్టిపెరిగిన మ‌ట్టి భాషను  ఒక‌వేళ నేను మ‌ర‌చిపోతే, నా జ‌నాలు పాడుకునే పాట‌ల‌ను ఒక‌వేళ నేను మ‌ర‌చిపోతే, నాకు క‌ళ్లూ చెవులూ ఉండి ఏం లాభం? నాకు నోరుండి ఏం ప్ర‌యోజ‌నం? నా మ‌ట్టి ప‌రిమ‌ళాన్ని ఒక‌వేళ నేను మ‌ర‌చిపోతే, నా మ‌ట్టి కోసం నేనేమీ చేయ‌క‌పోతే, నాకు చేతులుండీ ఏం ఉప‌యోగం? నేనీ ప్ర‌పంచంలో దేనికి బ‌తుకుతున్న‌ట్లు? నా భాష పేద‌ద‌ని, బ‌ల‌హీన‌మైన‌ద‌ని అనుకోవ‌డం ఎంత వెర్రిత‌నం? నా త‌ల్లి తుదిప‌లుకులు ఎవెంకీ మాట‌లైన‌ప్పుడు!…

Read More

పరగ విద్య నేర్వ పండితుడై పోయి.. పూజ నీయుడౌను పుడమి యందు!!

గురుపూజోత్సవం సందర్భంగా తెలుగు వెలుగు సాహిత్య వేదిక జూమ్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సూర్యాపేటకు చెందిన కవయిత్రి నల్లాన్ చక్రవర్తుల రోజాదేవి..గురు పరబ్రహ్మ స్వరూపం శీర్షిక తో స్వీయ రచన చేశారు. గురుమూర్తులు అంశంతో   వచ్చిన ఈ పద్యం ఆలోచింప చేసే విధంగా ఉంది.  1.బ్రతుకు తెరువు చూపు భగవంతుడీతడే చిత్తమందు నిలుచు చిన్మయుండు శ్వేత పత్ర మంటి శిష్యుని హృదయాన చిత్తరువయి చాలా సేవలందు 2.అమ్మ జన్మమిచ్చు, అయ్య నడకనేర్పు విద్య లెల్లగరపు విజ్ఞుడొకడె…

Read More

‘శ్రావణా మాసం’ పై కవియిత్రి ప్రత్యేక రచన..

శ్రావణా మాసాన శుభ శుక్రవారాన సిరులు కురిపించుమా శ్రీలక్ష్మి దేవీ పాలసంద్రములోన పుట్టినా తల్లీ విష్ణువు హృదయాన వెలసినా రాణీ చల్లని చంద్రికలు జాలువారిన భువిని వెండి తళతళకాంతి వేల్పు తోబుట్టువు మాబతుకులలోన పండు వెన్నెల కురిసి సుఖ శాంతులివ్వుమాశరదిందుచంద్రికా కామధేనువు, కల్ప వృక్షములతోడుత కోరికలు తీర్చు మాకనక మహాలక్ష్మీ ధాన్యసంపదలిచ్చు,విద్యా ధైర్యము నిచ్చు ఆదిలక్ష్మి వైమమ్ము ఆదుకోవమ్మా ఆరోగ్యమానంద మిచ్చు ధన్వంతరీ వేల్పు తోబుట్టువు గాన రోగబాధలు బాపు వరములిచ్చి వేగ వారిజాక్షిరో నీవు మాజన్మ…

Read More
Optimized by Optimole