యోగి-యోగ్యత.. “జీవన సాఫల్య పురస్కారం”..
ఆర్. దిలీప్ రెడ్డి : ( సీనియర్ జర్నలిస్ట్) 83 సంవత్సరాల పెద్దమనిషి వెనక్కి తిరిగి చూసుకుంటే…. 42 సంవత్సరాలకు పైబడి పర్యావరణ పరమైన ప్రజాజీవితాన్ని …నిరంతరాయంగా కొనసాగించడం! వ్యవసాయోద్యమాలు, కాలుష్య వ్యతిరేక పోరాటాలు, అణు రియాక్టర్ రాకను అడ్డుకోవడం, ఫ్లోరోసిస్ పై ఆందోళనలు, నీళ్ల కోసం నిరసనలు, యురేనియం తవ్వకాల్ని నిలువరించడం…. ఇలా ఒక్కటేమిటి! “ఆతడనేక యుద్దముల ఆరితేరిన యోద్ద…” అన్నట్టు ముందుండి ఎందరెందరినో నడిపించారు. జర్నలిస్టులు, న్యాయవాదులు, యాక్టివిస్టులు… ఇలా ఎవరెవరికైనా రిసోర్స్ పర్సన్…