తిరుప‌తి లో వ‌ర‌ద‌ల బీభ‌త్సానికి కార‌ణాలు ఏంటి..?

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన తిరుమ‌ల న‌గ‌రం ఎడ‌తెర‌పిలేని వ‌ర్షాల‌కు త‌డిసిముద్ద‌వుతోంది. బంగాళాఖాతంలో వాయుగుండ ప్ర‌భావంతో న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. చ‌రిత్ర‌లో గ‌తంలో ఎన్న‌డూలేనంత‌గా ఎగువ నుంచి వ‌ర‌ద వ‌స్తుండ‌టంతో దాదాపు అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల వ‌ర‌ద ధాటికి వాహ‌నాలు కొట్టుకుపోయాయి. మరో రెండు రోజులు భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంద‌న్న వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో స్థానిక ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూగ‌డుపుతున్నారు. అథ్యాత్మిక‌న‌గ‌రంగా పేరుగాంచిన తిరుమ‌ల వ‌ర‌ద‌ల‌తో ఎందుకు అల్లాడుతోంది. గ‌త 30…

Read More

భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం..!!

ఎడతెరిపిలేని వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో రెండ్రోజులపాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. కొన్నిజిల్లాలో రెడ్‌ అలర్ట్.. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేశారు. ఏకధాటి వర్షాలకు కేరళలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఎర్నాకులం జిల్లాలో కొండచరియలు…

Read More

భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం!

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షంతో చెన్నై నగరం జలమయమైంది. చెన్నై, పుదుచ్చేరి నగరాలతో పాటు తిరువల్లూర్, రాణిపేట్, వెల్లూర్, తిరుపత్తూర్, తిరువనమలై, కల్లకురిచి, సాలెంలో వరద బీభత్సం కొనసాగుతోంది. విల్లుపురం, కుడలోర్, క్రిష్ణగిరి, ధర్మపురి, నమక్కల్, పెరంబలూర్, అరియలూర్ లోనూ జనం అవస్థలు పడుతున్నారు. వరదనీటికి తోడు మురుగునీరు ఇళ్లల్లోకి చేరి జనం నరకం చూస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని హాస్పిటళ్లు, ఆఫీసులు జలమయమయ్యాయి. రోడ్లపై 2 నుంచి 3…

Read More

తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం : వాతావరణ శాఖ

బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణలో రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.నిన్న ఏర్పడిన అల్పపీడనం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలోకి ఈశాన్య దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపారు. సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు.

Read More

రానున్న మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

రానున్న మూడు రోజులు 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో… రానున్న రెండు మూడు రోజుల్లో వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిస్తాయని తెలిపింది. కాగా నేడు,రేపు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీవర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల…

Read More
Optimized by Optimole