మౌనం వీడిన నటి శిల్పా శెట్టి!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఎట్టకేలకు మౌనం వీడింది. తన భర్త రాజ్‌కుంద్రా పోర్న్ చిత్రాల కేసు విషయమై తప్పుడు ఆరోపణలు చేయొద్దని ఆమె కోరింది. కుటుంబ గోపత్యను గౌరవించాలని.. నిజా నిజాలు ఏమిటో తెలియకుండా తప్పుడు ఆరోపణలు చేయొద్దని అభ్యర్థించింది. మీడియా తమ కేసుపై ఆసక్తి కాస్త మానుకోవాలని సూచించింది. కొంత మంది మాపై పనికట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీడియా, శ్రేయోభిలాషులు కూడా మాపై ఎన్నో నెగటివ్ కామెంట్లు చేశారు. దయచేసి తప్పుడు ఆరోపణలు చేయొద్దు….