*తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక సమ్మక్క-సారక్క జాతర…!!
హైదరాబాద్: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సమ్మక్క సారక్క వనదేవతల జాతర ఖ్యాతి ఖండాంతరాలు దాటాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.., పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. గతం కంటే ఈ సారి చాలా ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయం కాన్ఫరెన్స్ రూంలో మేడారం మాస్టర్…