MakaraSankranti: మకర సంక్రాంతి ప్రత్యేకత ఏమిటంటే?
Sankranti2024: సంక్రాంతి పండుగలో రెండవ రోజుకు మకర సంక్రాంతి అని పేరు. ఇది అపూర్వ పుణ్యకాలం. సూర్యుడు మేషం మెుదలుకుని మీనం వరకు వరుసగా 12 రాశులలో ప్రవేశిస్తాడు. మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించిన కాలాన్ని మకర సంక్రమణం అంటారు. సంక్రమణం నాడు దర్భాసనంపై కూర్చుని దేవతారాధన చేసిన వాడు జన్మ జన్మల దారిద్ర్యము నుండి విముక్తి పొందుతాడు. సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే పవిత్ర దివసం. ఈనాడు గుమ్మడికాయను దానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. వంశాభివృద్ధి అవుతుంది….