పార్టీలకు ఈ యేడు పరీక్షా కాలమే..!
2023, సమకాలీన భారత రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న సంవత్సరం. ఈ కాలపు రాజకీయాల్లో ఎన్నికలు పార్టీలకు అగ్నిపరీక్ష మాత్రమే కాదు ఒక అవకాశం. తిరగేసి చూసినా అంతే, అవకాశం మాత్రమే కాదు ఒక అగ్నిపరీక్ష! లోక్‌సభకు 2024 లో జరగాల్సిన సాధారణ ఎన్నికలకు ముందు ఈ సంవత్సరమే 9 రాష్ట్రాల్లో ఆయా అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. బయట ప్రచారం జరుగుతున్నట్టు కశ్మీర్ లో ఎన్నికలు జరిపించే చిత్తశుద్ది కేంద్రం కనబరిస్తే, అది ఈ యేడాది ఎన్నికలు…