భీష్ముడి రాజనీతి కథ !
భీష్ముడు ధర్మరాజుకు రాజనీతి సూత్రాల గురించి వివరిస్తూ భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన నీతికథ ! పూర్వం ఓ ధనిక వర్తకుడు ఉండేవాడు. అతడికి ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లలూ ముచ్చటగా ఓ కాకిని పెంచుతూ ముద్దు చేయసాగారు. ప్రతిరోజూ వారు తినగా మిగిలిన ఎంగిలి ఆహారాన్ని విదిలిస్తే తిని ఆ కాకి గుండ్రంగా తయారైంది. రోజూ మృష్టాన్నం దొరకడంతో దాని అతిశయానికి గర్వానికి అంతులేకుండా పోయింది. అసలు తనలాంటి పక్షి ఈ భూమ్మీదే లేదన్నంతగా…