ఉప ఎన్నిక ప్రచారానికి దూరమన్న వెంకట్ రెడ్డి .. అభిప్రాయం తీసుకుంటామన్న రేవంత్..
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. పీసీసీ రేవంత్ తీరుపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన లేఖ రాశారు. తనకు సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.పార్టీ వ్యవహరాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ వలన తెలంగాణలో పార్టీ భ్రష్టుపట్టిపోతుందని.. తక్షణమే కమల్ నాథ్ లాంటి నేతలను నియమించాలని కోరారు. అనుభవం లేని నాయకుడికి పీసీసీ పగ్గాలు ఇవ్వడం వలన పార్టీ భ్రష్టుపట్టిపోతుందని .. రేవంత్ తో…