గద్దర్ కి కన్నీటి నివాళి!

రాదిరె:   శిశిర కాలపు శీతగాలి ఒరిపిడి పెడుతోంది. స్వెటర్ కూడా లేదు, వేడి వయసు బద్దకమేమో… కొనాలి అనుకుంటూనే వాయిదా వేస్తున్నా. ఏముందిలే, ఒకపూటేగా….! ఆ ఉత్సాహం, ఆ ఉద్వేగం మాత్రం చూడాలి! ఎందుకనుకున్నానో… ఆ పూట అలా ఫిక్సయిపోయా! 1989 జర్నలిజం వృత్తిలోకొచ్చి నెలలు అవుతోందంతే! రిపోర్టింగ్ కి రాలేదింకా… ట్రయినీ సబెడిటర్ గానే వున్నా! సోమాజీగూడ ఆఫీస్ లో పని కాస్త తొందరగానే ముగించుకొని, బయటపడేటప్పడికి 8 దాటినట్టుంది. జాగుచేయకుండా నేరుగా నిజాం కాలేజీ…

Read More

TSPSC : గ్రూప్ _1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ విడుదల…!

Telangana: తెలంగాణ గ్రూప్_1 ప్రిలిమ్స్ తుది కీ  విడుదలైంది. టీఎస్పీఎస్సీ అధికారులు ఫైనల్ కీ ని మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. జూన్ 28న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కి సంబంధించి ప్రాథమిక కి రిలీజ్ అయింది. అనంతరం అధికారులు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న TSPSC   ఫైనల్ కీ విడుదల చేసింది.

Read More

తెలంగాణాలో ‘బీసీ’ అస్త్రం పాచిక పారేనా ?

Telanganapolitics:  తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల రాజకీయాల్లో సామాజిక వర్గాలు పాచికలుగా మారుతున్నాయి.  జనాభాలో 50 శాతానికిపైగా ఉన్నా రాజకీయంగా వెనుకబడి ఉన్నామనే అసంతృప్తి అన్ని రాజకీయ పార్టీల్లో నెలకొంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ప్రతీసారి ఎన్నికలకు ముందు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలనే డిమాండ్‌ను వివిధ బీసీ సంఘాలు లేవనెత్తడంతోపాటు రాజకీయ పార్టీల్లోని ఆ వర్గానికి చెందిన నాయకులు కూడా డిమాండ్లు పెట్టడం సర్వసాధారణం. అయితే ఈ డిమాండ్‌ను ఎక్కువగా కాంగ్రెస్‌ పార్టీ…

Read More

తెలంగాణలో టగ్ ఆఫ్ వార్.. బీఆర్ఎస్ కు కష్టమే..?

Telangana: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుంది. ఎన్నికలకు  నాలుగు నెలలు మాత్రమే గడువు ఉండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని స్పీడ్ అప్ చేశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజారిటీతో హ్యాట్రిక్ పై కన్నేసింది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రభుత్వంపై  వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని అస్త్రంగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని పట్టుదలతో ఉన్నాయి.ఇప్పటికే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మూడు పార్టీల మధ్య హోరాహోరీ జరిగేందుకు ఆస్కారం ఉందని…

Read More

కిషన్ రెడ్డికి ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్‌షిప్ అవార్డు’

BJPTelangana:కేంద్ర  పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ  మంత్రి  కిషన్ రెడ్డిని ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్‌షిప్ అవార్డు’ వరించింది. భారత్-అమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్-టు-పీపుల్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే.. ‘యూఎస్ ఇండియా SME కౌన్సిల్’ సంస్థ ఈ అవార్డును కేంద్రమంత్రికి అందజేసింది.భారతదేశపు ఘనమైన సంస్కృతిని ప్రోత్సహించడంతోపాటు  పర్యాటకాభివృద్ధికి కేంద్రమంత్రి  చేసిన కృషికి గానూ.. అమెరికాలోని మేరీలాండ్ స్టేట్ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఈ అవార్డును కేంద్రమంత్రికి శనివారం రాత్రి (భారత…

Read More

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు వార్తలు చూసి అలవాటైపోయింది: సంజయ్

BJPTelangana:తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై తరుణ్ చుగ్ సహా జాతీయ నాయకులు అనేకసార్లు స్పష్టమైన ప్రకటన చేశారు. అయినా నన్ను మారుస్తున్నారంటూ కొన్ని ఛానళ్లు పదేపదే వార్తలు రాస్తున్నాయి. ఆ వార్తలు చూసి చూసి మా కార్యకర్తలకు అలవాటైపోయింది. రాసి రాసి మీకు అలవాటైనట్లుంది. ఎక్కడైనా నిప్పు లేనిదే పొగరాదంటారు. కానీ ఏడాది నుండి నన్ను మారుస్తారని…

Read More

ఎంజీఆర్‌ రికార్డును సమం చేయడం కేసీఆర్‌ కు సాధ్యమేనా ?

Nancharaiah merugumala senior journalist:  దక్షిణాది రాష్ట్రాల్లో ఓ ప్రాంతీయపక్షం వరుసగా మూడు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడం తమిళనాడులో 1970లు, 80ల్లో సాధ్యమైంది. తమిళ మొదటి సూపర్‌ స్టార్‌ ఎంజీ రామచంద్రన్‌ వరుసగా 1977, 1980, 1985 తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ఏఐఏడీఎంకేను విజయపథంలో నడిపించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మొదటిసారి కేంద్రం అసెంబ్లీని రద్దుచేయడం వల్ల, మూడోసారి మరణం వల్ల ఎంజీఆర్‌ మూడుసార్లూ పూర్తి పదవీకాలం సీఎం పదవిలో కొనసాగలేకపోయారు….

Read More

సీఎం కేసీఆర్‌ త్వరలో ‘బ్రాహ్మణ బంధు’ ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు!

Nancharaiah merugumala senior journalist:( తెలంగాణ ‘విప్రహిత’ ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో ‘బ్రాహ్మణ బంధు’ ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు!) తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారు శుక్రవారం (2023 జూన్‌ 2) పదో ఏడాదిలోకి అడుగుబెడుతున్నారు. ఈ గొప్ప సందర్భానికి ముందు బుధవారం ఆయన హైదరాబాద్‌ గోపనపల్లిలో ఆరెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ‘విప్రహిత’ బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించడం డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన గొప్ప పుణ్యకార్యం….

Read More

క్రిష్ణయ్య ను చంపిన హంతకులను హైదరాబాద్ లో అడుగుపెట్టనీయం: బండి సంజయ్

BJPTelangana: యావజ్జీవ శిక్షపడి  జైలు జీవితం అనుభవిస్తున్న ఆనంద్ మోహన్ ను శిక్షాకాలం పూర్తి కాకముందే నితీశ్ కుమార్ ప్రభుత్వం విడదల చేయడం సిగ్గు చేటన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. నితీష్ కుమార్ వైఖరిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు ఎందుకు స్పందించలేదని బండి ప్రశ్నించారు. పాలమూరు బిడ్డను చంపేసిన హంతకుడు తెలంగాణలో అడుగుపెడుతుంటే ఎందుకు అనుమతిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను కాల్చి చంపి పేదల రక్తం తాగిన యూపీ…

Read More

యువత ఒక నెంబర్ కాదు… డిసైడర్‌..!!

Telangana: తెలంగాణలో ఎన్నిక‌ల గ‌డువు ముంచుకొస్తుంది. రానున్న ఎన్నిక‌ల్లో యువ‌త కీల‌క‌పాత్ర పోషించే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.  ఈ నేప‌థ్యంలో విధాత పోలిటిక‌ల్‌ క‌న్సల్టెన్సీ.. రానున్న ఎన్నిక‌ల్లో యువ‌త పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వ‌హించారు.ఈ కార్య‌క్ర‌మానికి  ముఖ్య అతిథులుగామోటివేషనల్‌ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్ర,  శాతవాహన యూనివర్సిటీ సోషల్‌ సైన్స్ డీన్  ప్రొఫెసర్ సూరేపల్లి సూజాత , సీనియర్  జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు నేలంటి మధు  , ఓ యూ JAC వ్యవస్థాపక సభ్యులు శ్రీనివాస్ కోట,…

Read More
Optimized by Optimole