కొండంత సంభాషణలున్నా.. గోరంత దృశ్యం కావాల్సిందే!
విశీ: తెలుగు సినీ పరిశ్రమలో ‘దాసి’ సినిమా ఒక సంచలనం. ప్రఖ్యాత దర్శకుడు బి.నరసింగరావు దర్శకత్వంలో 1988లో వచ్చిన ఈ సినిమా నేటికీ భారతీయ సినిమాల్లో ఒక క్లాసిక్‌గా మిగిలింది. కథ, కథనం, నటీనటుల నటన, ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం.. ఏ క్రాఫ్ట్‌లోనూ తగ్గక, తనదైన ముద్ర వేసింది. 1920లో తెలంగాణ ప్రాంతంలోని ఒక గడీలో దొర సాగించిన అరాచకాలు, దాసీల ఆవేదన, వారి జీవనశైలిని ఈ చిత్రం అచ్చంగా తెరకెక్కించింది. సినిమాలో నటి అర్చన దాసి కమ్లిగా…