Telangana: కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం అవినీతి రుజువైంది: మహేష్‌కుమార్ గౌడ్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డి పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కవిత చేసిన వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తేలిపోయిందని ఆయన స్పష్టం చేశారు. “కాళేశ్వరంలో తప్పు చేసింది కేసీఆరా? లేక హరీశ్ రావా? అనేది మాకు సంబంధం లేదు. వారి హయాంలోనే స్కాం జరిగిందనేది కవిత మాటలతో రుజువైంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే? కాళేశ్వరం అవినీతిలో మామ కేసీఆర్ వాటా ఎంత..?…