హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు!

కర్ణాటకను కుదిపేసిన హిజాబ్‌ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడం తప్పనిసరి కాదని..విద్యా సంస్థల ప్రొటోకాల్‌ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం హిజాబ్ వివాదంపై తీర్పును వెలువరించింది. కాగా ఈ ఏడాది జనవరిలో, ఉడిపి పాఠశాల్లో హిజాబ్‌ వస్త్రధారణ పై వివాదం చెలరేగింది. దీంతో కొంతమంది బాలికలు…

Read More

పెగాసస్ పై విచారణకు ప్రత్యేక కమిటీ_ సుప్రీం

దేశంలో పెగాసస్‌ నిఘా వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పలు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. పెగాసస్‌ వ్యవహారంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమిస్తున్న‌ట్లు తెలిపింది.చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతం అని ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన స‌రికాద‌ని, ఈ విష‌యాన్ని కోర్టు సహించదని స్ప‌ష్టం చేసింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్‌ ప్రత్యక్ష…

Read More

ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద దోషిగా గుర్తించిన వ్యక్తిపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేస్తూ సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైనా కేసు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదైనప్పటికీ.. ఆ కేసుకు ప్రైవేటు/సివిల్‌ స్వభావం ఉంటే, బాధితుల కులం ఆధారంగా చేయని నేరమైతే.. దానిపై చేపట్టిన క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా కులం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే బాధితులకు ఉపశమనం, పునరావాసం కల్పించేందుకు.. వారికి రెండింతల రక్షణనందించేందుకు…

Read More

నటి శిల్పాశెట్టికి కోర్టులో చుక్కెదురు!

బాలీవుడ్​ నటి శిల్పాశెట్టికి ముంబయి హైకోర్టులో చుక్కెదురైంది.పోర్న్ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన భర్త రాజ్ కుంద్రా పై కొన్ని మీడియా సంస్థల తోపాటు సోషల్​మీడియాలో కథనాలు రాకుండా అడ్డుకోవాలని కోర్టులో పిటిషన్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విచారించిన న్యాయస్థానం.. “భార్యాభర్తల మధ్య జరిగిన విషయాన్ని మీడియాలో వెల్లడించడం సరికాదు” అని శిల్పాశెట్టి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన జస్టిస్​ గౌతమ్​ పటేల్​ ఈ విధంగా తెలిపారు. “పోలీసులు…

Read More

లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు!

లైంగిక వేధింపులకి సంబంధించి బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2016లో ఓ వ్యక్తిపై నమోదైన కేసులో జస్టిస్ పుష్ప తీర్పును వెలువరిస్తూ..  ‘పోక్సో’చట్ట ప్రకారం శరీర భాగాలను దుస్తుల పై నుంచి తాకితే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కాదని వ్యాఖ్యానించింది. కేసుకి సంబంధించిన వివరాల ప్రకారం ..  ఓ పన్నెండేళ్ల బాలికను 39 ఏళ్ల వ్యక్తి మాయమాటలు చెప్పి దుస్తులు తొలగించే ప్రయత్నం చేశాడు. వెంటనే బాలిక కేకలు వేయడంతో తల్లి రావడం.. కేసు నమోదు కావడం జరిగింది….

Read More
Optimized by Optimole