విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ముఖ్యమంత్రి నోరు విప్పాలి: ఏపిసిసి గిడుగు రుద్రరాజు
విజయవాడ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నోరు విప్పి ప్రజలకు సమాధానం చెప్పాలని ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో విలేకరుల సమావేశంలో గిడుగు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తోందని, సుమారు 35 వేల ఎకరాలలో విస్తరించి వున్న విశాఖ ఉక్కును రక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉందని నొక్కి చెప్పారు. ప్రియతమ ప్రధాని ఇందిరా గాంధీ కల విశాఖ స్టీల్…