విశాఖ కిడ్నీ మాఫియా ప్రధాన సూత్రధారులను బయటకు లాగాలి : నాగబాబు
Janasena: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కనీస జీవనాధారం లేని నిరుద్యోగ యువతను, నిరుపేద కుటుంబాలను విశాఖ కిడ్నీ మాఫియా పావులుగా వాడుకుంటోందన్నారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు.ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ప్రజలు బలవుతున్నారన్నారు. ద్విచక్ర వాహనం కొనిస్తామని ఆశ చూపి శరీర అవయవాలు దోచుకునే స్థితికి వ్యవస్థను తీసుకొచ్చారు అంటేనే పరిస్థితి అర్థం అవుతోందని మండిపడ్డారు. ఇంతకాలం గుట్టు చప్పుడు కాకుండా నడిపించిన కిడ్నీ రాకెట్ బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారన్నారు. ఇంకెంతమంది బాధితులు ఉంటారో…