నేలపట్ల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

యాదాద్రి _ భువనగిరి: నేలపట్ల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కు చెందిన 1997_98 విద్యా సంవత్సరం పదో తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్దులు.. ఉపాధ్యాయులకు శాలువా కప్పి , సరస్వతి దేవి జ్ఞాపికతో సన్మానించారు. విద్యార్థులు తమ పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.తమ విద్య, వైవాహిక జీవిత విశేషాలను స్నేహితులతో పంచుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకున్నారు.  

Read More

బీజేపీ అధికారంలోకి రాగానే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ; బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేసిందని సంజయ్​ ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బండిసంజయ్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరమగ్గాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తామని…

Read More
Optimized by Optimole