NelloreRural: వైసీపీ ప్రభుత్వం నేడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్నకు చెబుదాం కౌంటర్ గా టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు రూరల్ ప్రజా సమస్యలను ఏకరువు పెడుతూ..” ప్రజలగోడు చెపుతున్నాం.. వినండి.. మా సమస్యలను పరిష్కరించండి స్లోగన్ తో ఎంఎల్ఏ కార్యాలయంలో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. నియోజకవర్గంలో కుంటుపడిన అభివృద్ధి పనుల్ని ఏకరువు పెడదాం.. వినపడేలా ..విజృంబిద్ధాం .. సాధించుకుందాం ” అంటూ మీడియా వేదికగా పిలుపు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ దూకుడు ప్రదర్శిస్తుంటే.. ఇటీవల టీడీపీ లో చేరిన ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి సైతం వినూత్న కార్యక్రమాలతో జనంతో మమేకమవుతున్నారు.