శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘనవిజయం..!

శ్రీలంకతో తొలి టెస్ట్​లో భారత్​ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విజృభించడంతో.. తొలి ఇన్నింగ్స్​లో 174 పరుగులకే కుప్పకూలిన లంక జట్టు ఫాలో ఆన్​లోనూ చతికిలపడింది. రెండో ఇన్నింగ్స్ లో భారత స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్ ధాటికి ఆజట్టు 178 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత జట్టు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో రెండు టెస్టుల సిరీస్ లో 1_0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా.. జడేజా,పంత్ రాణించడంతో 574/8 భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ దిగిన లంక జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఫాలో ఆన్ ఆడిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ 178 పరుగులకే ఆలౌటైంది. 

మరోవైపు భారత్ స్పిన్నర్ అశ్విన్ తొలి టెస్టులో అరుదైన రికార్డ్ సాధించాడు. భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లలో కపిల్‌దేవ్ (434)ను రికార్డును అధిగమించి రెండోస్థానానికి(435) ఎగబాకాడు. అతని కంటే ముందు దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (619) ముందు వరుసలో ఉన్నారు.

Optimized by Optimole