దేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా!

దేశంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 5 వేల 476 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 158 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 59 వేల 442 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 0.60 శాతంగా ఉంది.

ఇక గడిచిన 24 గంటల్లో 9 వేల 754 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,23,88,475 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.66 శాతానికిపైగా ఉంది.

అటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,78,83,79,249 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. నిన్న దేశంలో 26,19,778 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.