టీ20 సిరీస్ టీంఇండింయా కైవసం..!

ఇంగ్లాడ్ తో టీ20 సిరీస్ లో భారత్ మరోసారి అదరగొట్టింది. శనివారం జరిగిన రెండో టీ20 లో అతిధ్య జట్టుపై 49 పరుగులతో గెలుపొందింది. భారత్ నిర్ధేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక..ఇంగ్లీష్ టీం 121 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీ20 సిరీస్ నూ టీంఇండింయా కైవసం చేసుకుంది.

అంతకూముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణిత ఓవర్లలో 170 పరుగుల చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ ,కీపర్ రిషబ్ పంత్ అదిరే ఆరంభం ఇచ్చారు.ఆతర్వాత వచ్చిన.. సూర్యకుమార్, హార్ధిక్ పాండ్యా, దినేష్ కార్తిక్ తమవంతు పాత్ర పోషించడంతో..అతిధ్య జట్టుకు 171 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేషించింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లాడ్ జట్టు.. భారత్ బౌలర్ల ధాటికి 121 పరుగులకే పరిమితమైంది. భారత్ విజయంలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో కీలకపాత్ర పోషించారు. బుమ్రా, చాహల్‌ 2 వికెట్లు తీయగా హార్దిక్‌ పాండ్య, హర్షల్‌ పటేల్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.