indvszm: జింబాబ్వే పై భారత్ విక్టరీ..టీ20ల్లో తొలి జట్టుగా రికార్డు..!

Teamindia: టీంఇండియా యువ జట్టు అదరగొట్టింది. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి182 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో అతిధ్య జింబాబ్వే  జట్టు 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది. టీం ఇండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ అర్థ సెంచరీతో మెరిశాడు.ఈవిజయంతో భారత్ సిరిస్ లో 2-1 అధిక్యంలో నిలిచింది.

టీ20లో భారత్ అరుదైన రికార్డు…

జింబాబ్వే పై మూడో టీ20 విక్టరీతో భారత జట్టు అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.అంతర్జాతీయ టీ20ల్లో 150 విజయాలు పూర్తి చేసుకున్న తొలి జట్టుగా టీంఇండియా రికార్డుల్లోకెక్కింది.ఇప్పటివరకు 230 టీ20లు ఆడిన భారత్.. రికార్డు స్థాయిలో 150 మ్యాచ్లో గెలుపొందింది.పాకిస్థాన్ 142 విజయాలతో రెండో స్థానంలో..111 విజయాలతో న్యూజిలాండ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.  ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా 105 విజయాలతో నాలుగో స్థానంలో..104 విజయాలతో దక్షిణాఫ్రికా ఐదో స్థానంలో ఉన్నాయి.