గల్ఫ్ కార్మికుల ఇబ్బందులను మాటల్లో వర్ణించలేను: బండి సంజయ్

గల్ఫ్ కార్మికుల ఇబ్బందులను మాటల్లో వర్ణించలేనన్నారు  బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. జగిత్యాల నుంచి.. కుటుంబ పోషణ కోసం  టెన్త్ క్లాస్ చదివే  పిల్లాడు దుబాయ్ కి వలస పోయే దుస్థితి దాపురించిందన్నారు.  ప్రతిరోజు 5 బస్సుల్లో జనం ముంబైకి వలస పోతున్నారని సంజయ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే విదేశాల్లో వేల మంది వలస కార్మికులు జైళ్లలో మగ్గుతున్నారన్నారు.ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సంజయ్.. జగిత్యాల జిల్లా  ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా  సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. “ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే… మతతత్వం రెచ్చగొట్టినట్టా?అని ప్రశ్నించారు. 15 నిమిషాల్లో హిందువుల తలలను నరికి చంపుతానన్నా లుచ్చా నా కొడుకు గాడు… ఏం మాట్లాడినా ఊరుకుందామా?.. బరాబర్ నా ధర్మాన్ని నేను కాపాడుతా… పోరాడుతా. హిందూయేతర పండుగలకు అనుమతి ఇచ్చే కేసీఆర్ ప్రభుత్వం… హిందువుల పండగలు జరుపుకోవాలంటే అనుమతుల పేరుతో ఇబ్బంది పెడుతోందంటూ”  సంజయ్ నిప్పులు చెరిగారు.

కాషాయం కోసం ప్రాణ త్యాగాలు చేసిన గడ్డ జగిత్యాల..

జగిత్యాల వట్టి గడ్డ కాదన్నారు సంజయ్. నక్సలైట్లు వార్నింగ్ ఇచ్చినా… కాషాయ జెండా కోసం ప్రాణ త్యాగం చేసిన వ్యక్తులు పుట్టిన గడ్డని కొనియాడారు.ఇక్కడ  జితేందర్, రామన్న, గోపన్నల వంటి గొప్ప వ్యక్తులు పుట్టిన గడ్డని అభిప్రాయ పడ్డారు.

టిఆర్ఎస్.. ఢిల్లీలో వీఆర్ఎస్..

టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యిందని..ఇప్పుడు ఢిల్లీ పోయి వీఆర్ఎస్ అవుతుందని సంజయ్ ఎద్దేవా చేశారు. వేములవాడ ఆలయాన్ని ‘ప్రసాదం స్కీం’ కింద అభివృద్ధి చేద్దామంటే… కేసీఆర్ సహకరించడం లేదన్నారు. కొండగట్టు ప్రమాదంలో పేదోళ్లు చనిపోతే.. కేసీఆర్ బాధిత కుటుంబాలను ఆదుకున్నాడాని.. పోని కనీసం ఆ కుటుంబాలను పరామర్శించాడా?అని ప్రశ్నించారు. కొండగట్టులో కేసీఆర్ బిడ్డ ఏదైనా జాగా కొని ఉండవచ్చునని.. అందుకే అర్జెంట్ గా  100 కోట్ల రూపాయలని అంటున్నాడని సందేహం వ్యక్తం చేశారు. ఏపీలో సమైక్యాంధ్ర నాయకులతో కుమ్మక్కై, సెంటిమెంటు రగిలించి.. రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్ వ్యూహం పన్నారని సంజయ్ ఆరోపించారు. 

మాతా శిశు కేంద్రంలో అనేకమంది చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు సంజయ్. ఒక్క నెలలో ఆరుగురు బాలింతలు చనిపోయారన్నారు. బీసీ కుల వృత్తులను నిర్వీర్యం చేశాడన్నారు. జగిత్యాల ప్రాంత మున్సిపాలిటీకి కేసీఆర్ ఎన్ని కోట్ల నిధులు ఇచ్చాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవేమీ చెప్పకుండా… బిడ్డను కాపాడుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని మండి పడ్డారు. పేదలకు ఇండ్లు కట్టడానికి పైసలు లేవంట కానీ..కేసీఆర్ బిడ్డ లక్ష కోట్లు పెట్టి లిక్కర్ దందా చేయడానికి మాత్రం పైసలు ఉన్నాయటని సంజయ్ ఎద్దేవాచేశారు.

 

Optimized by Optimole