మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర షురూ.. టీఆర్ఎస్ పై బీజేపీ నేతలు ఫైర్!

మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర షురూ.. టీఆర్ఎస్ పై బీజేపీ నేతలు ఫైర్!

అధికార టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ నేతలు . బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర యాదాద్రి జిల్లాలో పార్టీ కార్యకర్తలు.. నేతల మధ్య కోలాహాలంగా ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చారు.హామీలతో మభ్యపెట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో టీఆర్ఎస్ అరాచక పాలను అంతమొందించడానికి ..ప్రతి బీజేపీ కార్యకర్త ఉగ్ర నరసింహా అవతారమెత్తాలన్నారు ఆపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. రజాకార్లను తరిమికొట్టిన నల్గొండ గడ్డకు ఆ శక్తి ఉందన్నారు. బాసర విద్యార్థులు బుక్కెడు బువ్వ కోసం రోడ్డెక్కితే పట్టించుకోలేని సీఎం.. దేశ రాజకీయాలను ఉద్ధరించడానికి బయలుదేరాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు.

టీఆర్ఎస్ మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అన్యాయం..అత్యాచారాలకు ప్రతిరూపం టీఆర్ఎస్ అని ఘూటుగా విమర్శించారు. కేసీఆర్ అహంకారానికి రాష్ట్ర ప్రజలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగమే ఉండాలని భావిస్తున్నారని ఆరోపించారు.టీఆర్ఎస్ నేతలకు ప్రజాసమస్యలను పట్టించుకునే తీరిక లేదని కిషన్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు.

రాష్ఠ్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు బీజేపీ నేత డీకే అరుణ. రెండు దశల పాదయాత్రతోనే కేసీఆర్ ఓడిపోతానని బయపడి బీజేపీ నేతలపై అక్రమ కేసులు..తిట్టడం మొదలెట్టారన్నారు.దళిత బంధును హుజురాబాద్ ఎన్నిక కోసమే తీసుకొచ్చారని మండిపడ్డారు. యాదాద్రి నరసింహాస్వామినే మోసం చేసిన ఘనుడు కేసీఆర్ అని అరుణ పేర్కొన్నారు.

ఇక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. హుజురాబాద్ లో కేసీఆర్ ను గుద్దు గుద్దితే ఎక్కడో పడ్డాడని.. అభాగ్యం ఇప్పడు నల్లొండ ప్రజలకు దక్కిందన్నారు.అధికారుల కాళ్లమీద గిరిజన బిడ్డలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు . ఈదుస్థితికి కారణమైన టీఆర్ఎస్ నేతలకు కర్రు కాల్చి వాతపెట్టే సమయం  వచ్చిందన్నారు. దళితుణ్ణి సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని.. కానీ ప్రధాని మోదీ దళిత బిడ్డను రాష్ట్రపతి చేశాడని ఈటల కొనియాడారు.

కాగా మూడోవిడత  యాత్ర సందర్భంగా  సంజయ్.. తొలిరోజు  ప్రజాసమస్యలను  తెలుసుకుంటూ వారికి భరోసా కల్పించారు. రాష్ట్రంలో వచ్చేది డబూల్ ఇంజన్ సర్కార్ అని.. అధికారంలోకి రాగానే సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించారు.