మునుగోడు రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక ఖరారైన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంట్రాక్ట్ కోసమే రాజీనామా చేసినట్లు నిరుపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. నిరూపించకపోతే పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా? అంటూ రేవంత్ కు సవాల్ విసిరారు రాజగోపాల్. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బ్రాండ్ అంబాసీడర్ రేవంత్ అంటూ ఘూటు వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ, వైఎస్సార్ అవమానపర్చిన నేత రేవంత్ ఒక్కడేని.. పీసీసీ పదవితో రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నాడని మండిపడ్డారు. తాను దేనికైనా సిద్ధమేనని.. బహింరగ చర్చకు రేవంత్ సిద్ధమా ?అంటూ ఛాలెంజ్ చేశారు.
నువ్వు ఉన్నది మూడు ఫీట్లు.. నన్ను తొక్కుతావా?
ఇక రేవంత్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు రాజగోపాల్. నువ్వు ఉన్నది మూడు ఫీట్లు.. నన్ను తొక్కుతావా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని బలిదేవత అన్న ఏకైక వ్యక్తి రేవంత్ మాత్రమేనన్నారు. పావురాల గుట్టపై పావురమై పోయాడంటూ వైఎస్సార్ మరణంపై అవమానకర వ్యాఖ్యలు చేసిన చిల్లర వ్యక్తి చెప్తే.. నేను వినాలా అంటూ మండిపడ్డారు.మునుగోడుకు రేవంత్ వస్తే .. కాంగ్రెస్ కు డిపాజిట్ రాదని తేల్చిచెప్పారు.
ప్లాన్ ప్రకారమే టీడీపీని ఖతం..
తెలంగాణలో ప్లాన్ ప్రకారమే రేవంత్ టీడీపీని ఖతం చేశాడన్నారు రాజగోపాల్. ఇప్పటీకి రేవంత్.. చంద్రబాబు డైరక్షన్లో పనిచేస్తున్నాడన్నారు.నాలుగు పార్టీలు మారిన చరత్ర అతనిది అంటూ విమర్శించారు. వ్యాపారంచేయకుండానే రేవంత్ వేల కోట్లు ఎలా సంపాదించాడని.. వ్యాపారస్తులను బెదిరించడం అతని అలవాటని.. బ్లాక్ మెయిల్ బ్రాండ్ నేమ్ రేవంత్ అంటూ ఘూటుగా స్పందించారు. కొడంగల్ లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా అతను.. ఎంపీగా ఎందుకు పోటిచేయలేదో చెప్పాలన్నారు. సీమాంధ్రుల ఓట్ల కోసమే మల్కాజ్ గిరిలో పోటీచేసి గెలిచాడని రాజగోపాల్ ఎద్దేవా చేశారు.
పీసీసీ పదవిని డబ్బుతో కొన్నాడు..
పీసీసీ పదవని రేవంత్ డబ్బుతొ కొన్నాడని సంచలన ఆరోపణలు చేశాడు రాజగోపాల్. ఉప ఎన్నిక భయంతో ఉత్తుత్తి రాజీనామా చేసి చంద్రబాబుకు ఇచ్చాడని.. స్పీకర్ ఇవ్వలేదన్నారు.పీసీపీ పదవితో రాష్ట్రాన్ని దోచుకోవాలనుకుంటున్నాడని మండిపడ్డారు. రేవంత్ ఎందుకు జైలుకు వెళ్లల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జయశంకర్, కోదండరామ్ లను అవమానపర్చిన చరిత్ర అతనిది అన్నారు.కాంగ్రెస్లో సీనియర్ నేతలు కోమటిరెడ్డి , జగ్గారెడ్డి సంతృప్తిగా ఉన్నారా అంటూ రాజగోపాల్ ప్రశ్నించారు.
ఇక రాజగోపాల్ మాటల దాడితో కాంగ్రెస్ నేతలు ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. మునుగోడు సభకు సిద్ధమవుతున్న పార్టీ శ్రేణులకు రాజగోపాల్ వ్యాఖ్యలు హెచ్చరికగా భావిస్తున్నారు విశ్లేషకులు. సభకు సీనియర్ నేతలంతా హాజరవుతారా లేదా అన్న చర్చ పార్టీలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది.