వెస్టీండీస్ సిరీస్ లో హార్థిక్ పాండ్యా రికార్డుల మోత..

భారత్ స్టార్ ఆటగాడు హార్ధిక్ పాండ్యా వెస్టీండీస్ టీ20 సిరీస్ లో అరురదైన రికార్డులు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 లో 50 వికెట్లు పూర్తి చేసిన భారత ఆరోబౌలర్ గా హార్థిక్ నిలిచాడు. వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20 లో అతను ఈఘనత సాధించారు. అతని కంటే ముందు యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఈఫీట్ సాధించారు.

ఇక హార్థిక్ అంతర్జాతీయ T20 కెరీర్‌లో 50 వికెట్లు.. 806 పరుగులు చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 50 వికెట్లు తో పాటు 500 పరుగులు చేసిన 9 వ ఆటగాడిగా.. భారత్ ఏకైక ఆటగాడిగా హార్థిక్ నిలిచాడు. అతని కంటే ముందు జాబితాలో షకీబ్ అల్ హసన్, షాహిద్ అఫ్రిది, డ్వేన్ బ్రావో, జార్జ్ డాక్రెల్, మహ్మద్ నబీ, మహ్మద్ హఫీజ్, కెవిన్ ఓబ్రెయిన్ , తిసారా పెరీరా లిస్టులో చోటుసంపాదించారు.