రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల కౌంటర్..

టీపీసీసీ రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సెటైర్స్ తో రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పోరాడతా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంని ఎద్దేవా చేస్తున్నారు.. 2015 శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 5 కోట్ల రూపాయల లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి పట్టుబడి జైలుకు వెళ్లొచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిదని కమలనాథులు  ఆరోపిస్తున్నారు.

టీడీపీ నుంచి వెళ్లి కాంగ్రెస్ లో చేరితే ఆ తప్పు చెరిగిపోయి.. ఆయన నిప్పు అయినట్టేనా? బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ చెదలుపట్టిన నిప్పు రేవంత్ రెడ్డి కూడా మునుగోడులో బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించడం.. ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాలు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని మండిపడుతున్నారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి వెయ్యిమంది నాయకులతో లక్ష మందికి పాదాబివందనం చేస్తాడంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయంటున్నారు కాషాయం నేతలు. రేవంత్ రెడ్డి దానికన్న ముందు ఓటుకునోటు కేసులో చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా .. తెలంగాణలోని గడగడపకు వెళ్లి మూడున్నర కోట్ల మంది ప్రజలకు పాదాబివందనం చేసి, క్షమాపణ అడగాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాతే మునుగోడులో ఓట్లు అడగాలని.. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన రేవంత్ లాంటి  ముసుగు దొంగలను మునుగోడు నుంచి తరిమెయ్యడానికి ప్రజలు సర్వం సిద్ధం చేసుకున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం  వ్యక్ం చేస్తున్నారు.